TTD17th Oct 03:49 PMSunil Byrisetty1 min read

శ్రీవారి లడ్డూ ధరలు పెరగట్లేదు: చైర్మన్

శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవ

శ్రీవారి లడ్డూ ధరలు పెరగట్లేదు: చైర్మన్
శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా చేయడం సరికాదని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి వార్తలు పూర్తి అబద్దమైనవని, ఆధారాలు లేని వార్తలని ఆయన ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారిని భక్తులకు మరింత చేరువ చేసేందుకు పాత ధరలే కొనసాగుతాయని పేర్కొన్నారు.
Andhra Pradesh
TTD
Tirumala
Laddu Prasadam
BR Naidu
Tirupati
Temple News
Devotees
Fake News
Clarification
శ్రీవారి లడ్డూ
ప్రసాదం ధరలు
Scroll for the next article