News9th Mar 11:12 AMSunil Byrisetty1 min read

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమివ్వను

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాల కారణంగా నేడు, రేపు సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. 11,12,13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 వరకు గంట పాటు జరగనున్న తెప్పోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
TTD
Theppottsavam
తిరుమల
తెప్పోత్సవాలు
Scroll for the next article