TTD10th Nov 04:55 PMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం 16న
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16న పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. నవంబరు 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ చేపట్టనున్నారు. పుష్పయాగం రో
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16న పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. నవంబరు 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ చేపట్టనున్నారు. పుష్పయాగం రోజున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం జరపనున్నారు. అనంతరం సహస్రదీపాలంకార సేవ తర్వాత స్వామివారు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ సందర్భంగా నవంబరు 16న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.