TTD19th Jul 11:29 AMSunil Byrisetty1 min read

టీటీడీలో అన్యమత ఉద్యోగులు సస్పెండ్

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీలో పనిచేస్తున్న డీఈఈ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి,

టీటీడీలో అన్యమత ఉద్యోగులు సస్పెండ్
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీలో పనిచేస్తున్న డీఈఈ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, అదే ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ డా.జి.అసుంత లను సస్పెండ్ చేశారు. ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు, వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.
Andhra Pradesh news
tirumala
tirupati
TTD Suspends Four Employees
Bandi Sanjay
B.Eliezer
నలుగురు ఉద్యోగులు సస్పెండ్
Scroll for the next article