News2nd Apr 05:02 PMSunil Byrisetty1 min read

తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చం

తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.
TTD
CM Chandra babu
టీటీడీ అధికారులు ప్రజెంటేషన్
Scroll for the next article