News19th May 10:22 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
తిరుపతిలో అత్యాధునిక అతి పెద్ద బస్టాండ్ నిర్మాణం జరగబోతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మిన
తిరుపతిలో అత్యాధునిక అతి పెద్ద బస్టాండ్ నిర్మాణం జరగబోతోంది.
తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈ టెర్మినల్‌లో మొత్తం 98 ప్లాట్‌ఫాంలు ఉండనున్నాయి.
ఈ బస్టాండ్‌ను తిరుపతి ఆలయ గోపురం నమూనాతో నిర్మించనున్నారు.