News14th Oct 04:40 PMSunil Byrisetty1 min read
ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తిరుపతి, విశాఖపట్నం
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీ
దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ మారియట్ హోటల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరుగుతున్న సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున విశాఖపట్నం, తిరుపతిలను ప్రధాన గమ్యస్థానాలుగా ప్రతిపాదిస్తున్నామని, ఈ ప్రాంతాలు తమ రాష్ట్ర వైవిధ్యాన్ని, సంసిద్ధతను, అంతర్జాతీయ ప్రమాణాలను ప్రతిబింబింపజేస్తాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పేరా సముద్రతీర, మెరైన్ గమ్యస్థానం గా విశాఖ,అధ్యాత్మిక, సాంస్కృతిక గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.