News1st May 06:18 PMSunil Byrisetty1 min read
పుణ్యక్షేత్రాల్లో భద్రతపై కేంద్రానికి ఎంపీ ఫిర్యాదు
రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో పరిపాలనా లోపాలు, తరచూ జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి మరోసారి
రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో పరిపాలనా లోపాలు, తరచూ జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి మరోసారి లేఖ రాశారు.
సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించక పోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలలో ఇటీవల జరిగిన సంఘటనలని ఈ లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం,
తిరుమలలో క్యూ లైన్లలో తొక్కిసలాటలను వివరించారు.
తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి ఒక భక్తుడు పాదరక్షలతో సింహద్వారం వరకు వెళ్లడం వ్యవస్థలోని లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని తెలిపారు.
టిటిడి గోశాలలో 100 కంటే ఎక్కువ గోవులు మరణించిన ఘటన గురించి ప్రస్థావించారు.
పుణ్యక్షేత్రాలలో భద్రతా వైఫల్యాలపై ప్రత్యేక విచారణకు ఆదేశించాలని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.