News14th Jul 03:58 PMSunil Byrisetty1 min read
తిరుపతిలో అగ్నిప్రమాదం
తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు హడలెత్తించాయి. స్టేషన్ లూప్ లైన్లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్
తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు హడలెత్తించాయి. స్టేషన్ లూప్ లైన్లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులను దించి లూప్ లైన్లో ఆగి ఉన్న రైలులోని ఒక బోగీలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.