News26th Jan 05:26 PMSunil Byrisetty1 min read
టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఆటోల పంపిణీ
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై జనవరి 27కి మూడేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్బంగా టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ కేశ
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై జనవరి 27కి మూడేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్బంగా టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో టి.ఎన్.టి.యు.సిలోని ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలు పంపిణీ చేస్తున్నట్లు టి.ఎన్.టి.యు.సి అధ్యక్షుడు,ఏపీ బిల్డింగ్ & ఆదర్ కనష్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు తెలిపారు. టి.ఎన్.టి.యు.సి లో ఆటో కార్మికులుగా వున్న 50 మంది కార్మికులకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బిఆర్టీఎస్ రోడ్డులో శారదా కాలేజీ దగ్గర ఆటోల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు కింజారపు అచ్చెంనాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, దూదేకుల ఫైన్షాన్స్ కార్పొరేషన్ కె. నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు, పట్టాభి పాల్గొంటారని తెలిపారు.