News18th Aug 08:52 AMSunil Byrisetty1 min read

ఎన్డీఏ అభ్యర్థిపై 'ఇండి కూటమి’ గెలుస్తుందా?

ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఇండి కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న C.P. రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా NDA ఖరారు చేసింది. మరోవైపు విపక

ఎన్డీఏ అభ్యర్థిపై 'ఇండి కూటమి’ గెలుస్తుందా?
ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఇండి కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న C.P. రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా NDA ఖరారు చేసింది. మరోవైపు విపక్ష 'ఇండి' కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నెల 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 781 మంది సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో నెగ్గాలంటే కనీసం 391 ఓట్లు అవసరం. 422 మంది MPల బలం కలిగిన NDAకు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండి కూటమి విజయం సాధిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
India news
Vice President Election
INDIA Bloc candidate
NDA candidate
C.P. Radhakrishnan
Maharashtra Governor
opposition alliance
nomination deadline
ఇండి కూటమి వ్యూహం
భారత రాజకీయాలు 2025
ఉపరాష్ట్రపతి పోటీ
Scroll for the next article