News26th Jun 03:48 PMSunil Byrisetty1 min read

తల్లికి వందనం అప్డేట్.. నేడే లాస్ట్ ఛాన్స్!

‘తల్లికి వందనం’పై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12 నుంచి 14 వరకూ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేశార

తల్లికి వందనం అప్డేట్.. నేడే లాస్ట్ ఛాన్స్!
‘తల్లికి వందనం’పై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12 నుంచి 14 వరకూ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బు జమ కానీ వారు గ్రామ/వార్డు సచివాలయాలలో కంప్లైంట్ ఇవ్వొచ్చని మంత్రి లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ గడువు ఇవాళ్టి (జూన్ 26)తో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ఫిర్యాదులను పరిశీలన చేయనున్నారు. అర్హులు అని తేలితే, జూన్ 30 నుంచి వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది.
Andhra Pradesh news
nara lokesh
thalliki vandanam scheme
students
Complaint
తల్లికి వందనం
Scroll for the next article