Politics6th Apr 11:33 AMSunil Byrisetty1 min read
2 సీట్లతో మొదలై.. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా!
రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురములో బీజేపీ నిర్వహించిన పా
రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
అనంతపురములో బీజేపీ నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
వేడుకల్లో తెలంగాణ ఎంపీ ఎం. రఘునందనరావు, జిల్లా నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీని ఆదరించి అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే బీజేపీ విజయాలకు మూల కారణమని మంత్రి అన్నారు.
బీజేపీ నాయకులంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.