Politics25th Jun 10:32 AMSunil Byrisetty1 min read
వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నేడు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, తదితరులు పాల్గొననున్నారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు వైసీపీ నేతలే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై చర్చించనున్నారు.