Entertainment22nd Aug 09:27 AMSunil Byrisetty1 min read

ముగిసిన టాలీవుడ్ వివాదం.. షూటింగ్ షురూ!

టాలీవుడ్లో 18 రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్‌లు షురూ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాలు

ముగిసిన టాలీవుడ్ వివాదం.. షూటింగ్ షురూ!
టాలీవుడ్లో 18 రోజుల గ్యాప్ తర్వాత నేటి నుంచి షూటింగ్‌లు షురూ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. 22.5% వేతన పెంపునకు ఇరు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5% మూడో ఏడాది 5% పెంచేందుకు అంగీకరించాయి. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ వేసినట్లు అడిషనల్ లేబర్ కమిషనర్ తెలిపారు. కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు ఉంటారు. నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Tollywood
Film Industry
Movie Shootings
Revanth Reddy
Labour Commissioner
Wage Hike
Telangana
Film Workers
Shooting Resumes
ముగిసిన టాలీవుడ్ వివాదం
Scroll for the next article