Entertainment6th Aug 11:09 AMSunil Byrisetty1 min read
ఈడి విచారణకు సినీ నటులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడి విచారణకు హాజరు కానున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటులను కూడా విచారణకు రావాలని ఈడి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 న
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడి విచారణకు హాజరు కానున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటులను కూడా విచారణకు రావాలని ఈడి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11 న విచారణకు మరో నటుడు రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. అనంతరం 13న విచారణకు నటి, నిర్మాత మంచు లక్ష్మి హాజరవుతారు. గత నెల 30న విచారణకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ హాజరైన విషయం తెలిసిందే. అలాగే నటి నిధి అగర్వాల్ సహా పలువురు సినీరంగానికి చెందిన వారు ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.