Entertainment29th Jul 05:28 PMSunil Byrisetty1 min read
టాలీవుడ్ కు దిష్టి.. జాగ్రత్త హీరో!
టాలీవుడ్ కు దిష్టి ఏమైనా తగిలిందా? అందుకే అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారా? తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజా
టాలీవుడ్ కు దిష్టి ఏమైనా తగిలిందా? అందుకే అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారా? తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు వెళ్లారు. పహిల్వాన్ సీన్స్ తీస్తున్న సమయంలో చరణ్ చేతి మణికట్టుకు దెబ్బ తగిలి సర్జరీ జరగడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఈలోగా నటసింహం బాలకృష్ణ తన తాజా చిత్రం షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో మోకాలికి తీవ్ర గాయమై, వైద్యులతో సర్జరీ చేయించుకున్నారు. ఈ వరుసలో తాజాగా తారక్ కూడా చేరారు. డ్రాగన్ సినిమా షూటింగ్‌లో కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలింది. దీంతో టాలీవుడ్ కు ఏదో అయిందనే ప్రచారం మొదలైంది.