Mobiles25th Dec 12:46 PMSunil Byrisetty1 min read
ఈ ఏడాది టాప్ 5 అద్భుతమైన సెల్ఫీ కెమెరా ఫోన్లు
2025లో విడుదలైన చవకైన సెల్ఫీ కెమెరా ఫోన్లు ఆదరణ పొందాయి. Nothing Phone 3a కెమెరాతో పాటు స్టైల్ కూడా కోరుకునే వారికి మంచి ఎంపిక. ఇది 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వెనుకవ
2025లో విడుదలైన చవకైన సెల్ఫీ కెమెరా ఫోన్లు ఆదరణ పొందాయి. Nothing Phone 3a కెమెరాతో పాటు స్టైల్ కూడా కోరుకునే వారికి మంచి ఎంపిక. ఇది 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాల అమరిక ఉంది.
మోటోరోలా G86 పవర్ 5G సెల్ఫీ ప్రేమికులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మంచి డిటైల్స్ క్యాప్చర్ చేయడానికి ఇది అనువైనదిగా చెప్తారు. ఫోన్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 6720mAh బ్యాటరీతో రావడం వల్ల చాలాసేపు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వారికి.. Samsung Galaxy M36 5G బెస్ట్ ఎంపిక. ఇందులో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. Vivo Y400 Pro, బ్రైట్ డిస్ప్లే, షార్ప్ సెల్ఫీలు కావాలనుకునేవారికి చాలా నచ్చుతుంది.ఇది 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. వెనుక 50 మెగాపిక్సల్ కెమెరా రింగ్ LED ఫ్లాష్తో వస్తుంది. OnePlus Nord CE 5 శుభ్రమైన సాఫ్ట్‌వేర్, నమ్మదగిన పనితీరును కోరుకుంటారో వారి కోసం బెస్ట్. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సహజమైన టోన్ ఉన్న ఫోటోలను అందిస్తుంది. ఫోన్ MediaTek Dimensity 8350 Apex చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.