Celebrities20th Mar 01:07 PMSunil Byrisetty1 min read

విజయ్ దేవరకొండ, రానాపై కేసులు

బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఆన్‌లైన్ జూదంపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ప్రకటనలు చేసిన వారినీ బుక్ చేస్తోంది. ఆంధ్రా, తెలంగాణల్

విజయ్ దేవరకొండ, రానాపై కేసులు
బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఆన్‌లైన్ జూదంపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు ప్రకటనలు చేసిన వారినీ బుక్ చేస్తోంది. ఆంధ్రా, తెలంగాణల్లో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జోరుగా జూదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో యాప్ నిర్వాహకులు సెలబ్రిటీల ద్వారా ప్రకటనలు చేయించి, యువతను బెట్టింగ్ బారిన పడేలా చేస్తు్న్నారు. ఈ కేసులో ఇటీవల యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ తదితర 11 మందిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి, అనన్య నాగళ్ల, వర్షిణి తదితర సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపైనా కేసులు పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు నమోదు చేశారు. దీంతో వారందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తారని తెలుస్తోంది.
Betting App Case
Rana
Vijay Deverakonda
Celebrities
Case
రానా
విజయ్ దేవరకొండ
కేసు
Scroll for the next article