Education15th Aug 01:54 PMSunil Byrisetty1 min read
ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో శిక్షణ
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలిసార
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యారంగంలో గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ లో 37మందిని సింగపూర్ పంపించిన రాష్ట్రప్రభుత్వం.. తాజాగా మరో 29మందిని ఫిన్లాండ్ పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 8రోజులపాటు ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్లాండ్ లో పర్యటించనున్నారు. ఫిన్లాండ్ విద్యారంగంలోని ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసి, రాష్ట్రంలో సహ ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.