News7th Sep 09:04 AMSunil Byrisetty1 min read
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం!
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతభిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున జాగ
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతభిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసివేస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ మూతబడనున్నాయి. తిరుమల తిరుపతి, విజయవాడ కనక దుర్గమ్మ, శ్రీశైలం దేవస్థానం సహా
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్వరం ఆలయం, వరంగల్ భద్రకాళి ఆలయం తదితర ఆలయాలను మూసివేస్తున్నారు. వీటికి అనుబంధ ఆలయాలతో పాటు ద్వార బంధనం కూడా జరుగుతుంది. గ్రహణానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులకు దర్శనానికి తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.