News21st Jul 09:50 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో టూరిజం కాన్ క్లేవ్
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్య కార్యరూపంలోకి వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్య కార్యరూపంలోకి వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రకృతి సౌందర్యంతో పాటు ఎక్కువ సంఖ్యలో హోటల్స్, రిసార్ట్స్, గదులు, ఈవెంట్ మేనేజ్మెంట్ ల ఏర్పాటు అవసరాన్ని వివరించారు. పిపిపి విధానంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అటు శ్రీకాకుళం నుండి ఇటు అనంతపురం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం, విజయవాడలలో టూరిజం కాన్ క్లేవ్ లు నిర్వహించామన్నారు. త్వరలోనే తిరుపతిలో ఇన్వెస్టర్ కాన్ క్లేవ్ నిర్వహిస్తామన్నారు.