News27th Sep 01:16 PMSunil Byrisetty1 min read

పర్యాటకవృద్ధి ఆర్థిక ప్రగతికి పునాది

పర్యాటక రంగం దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఉపాధి అవకాశాల కల్పనతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరి

పర్యాటకవృద్ధి ఆర్థిక ప్రగతికి పునాది
పర్యాటక రంగం దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఉపాధి అవకాశాల కల్పనతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా పర్యాటకం నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సముద్ర తీర ప్రాంతాలు పర్యాటకులకు విశేష ఆకర్షణగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారిస్తోందన్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, హోటళ్లు, రవాణా, హస్తకళలు, సంప్రదాయ కళారూపాలు వంటి అనేక రంగాలకు ఇది ఊతమిస్తోందని చెప్పారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Scroll for the next article