Spiritual8th Aug 03:44 PMSunil Byrisetty1 min read
అహోబిలంలో పర్యాటక అభివృద్ధి
దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని APTDC చైర్మన్ డా. నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో జరుగుతున్న వి
దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని APTDC చైర్మన్ డా. నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. అనంతరం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో జరుగుతున్న వివిధ అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు. అహోబిలంలోని పురాతన ఆలయ నిర్మాణాలు, శిల్పకళా వైభవం, సహజ సౌందర్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. మన పూర్వీకుల అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం, కళా ప్రతిభ, వారసత్వ సంపద అద్భుతమన్నారు. అహోబిలం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటకానికి అపారమైన అవకాశాలు కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు. అహోబిలాన్ని ఆధ్యాత్మిక, వారసత్వ మరియు ప్రకృతి పర్యాటక కేంద్రంగా మరింత సమగ్రంగా అభివృద్ధి చేసి, దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.