Politics4th Mar 10:11 AMSunil Byrisetty1 min read
జర్మనీ చేరుకున్న పర్యాటక మంత్రి దుర్గేష్
నేటి నుండి బెర్లిన్ ఎక్స్ పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొననున్న మంత్రి దుర్గేష్. రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చేందుకు కృషి
నేటి నుండి బెర్లిన్ ఎక్స్ పో సెంటర్ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొననున్న మంత్రి దుర్గేష్. రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి దుర్గేష్. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను బెర్లిన్ వేదికపై వినిపించనున్న మంత్రి దుర్గేష్. పర్యాటక, అతిథ్య రంగాల్లో మౌలికసదుపాయాల కల్పన, ఎకో టూరిజంలో పెట్టుబడి, వివిధ రకాల పర్యాటక అవకాశాలను వివరించనున్న మంత్రి దుర్గేష్. దాదాపు 30 మందిపైగా పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ..వరల్డ్ మీడియాతో ఏపీ పర్యాటక అవకాశాలను వివరించనున్నారు. మంత్రి దుర్గేష్ తో పాటు బెర్లిన్ కు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట తదితరులు బెర్లిన్ వెళ్లారు.