News17th Aug 12:48 PMSunil Byrisetty1 min read
పర్యాటక ప్రదేశాలకు డిజిటల్ ప్రచారం
ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన అద్భుతమైన పర్యాటక, చారిత్రాత్మక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని తెలుపుతూ పర్యాటకులను ఆకర్షించేలా డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా ఏ
ప్రపంచ స్థాయిలో గుర్తించబడిన అద్భుతమైన పర్యాటక, చారిత్రాత్మక, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని తెలుపుతూ పర్యాటకులను ఆకర్షించేలా డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా ఏపీటీడీసీ విస్తృత ప్రచారం చేస్తోంది. వీడియోలో కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన కలంకారి ప్రత్యేకత, బాపట్ల జిల్లాలోని ప్రాచీన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం, శాసనాల గొప్పతనం, పరిణామ క్రమం, గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత వస్త్రాల విశిష్టత, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఉండవల్లి గుహల ప్రాశస్త్యం వివరిస్తూ వేరువేరుగా రూపొందించిన వీడియోలు పర్యాటకులను ఆకర్షించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించిన వీడియోలను ప్రతి ఒక్కరూ వీటిని లైక్ చేసి షేర్ చేసి మన ప్రాంతాల ప్రత్యేకతను ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కలంకారికి పెడన కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని, అలనాటి కలంకారీ వస్త్రాలు ఇక్కడ ప్రధానాకర్షణ అని, సహజ రంగులతో కూడిన అద్దకం ఇక్కడి ప్రత్యేకతని భారతీయ హస్తకళలో ప్రాచీనమైన కలంకారి చిత్రకళను, కళాకారుల నైపుణ్యాన్ని వివరిస్తూ ఏపీటీడీసీ రూపొందించిన వీడియో ఆకర్షిస్తోంది.
జాతీయ స్థాయిలో పేరున్న మంగళగిరి చేనేత, ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల గొప్పతనాన్ని, పానకాల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ ప్రాశస్త్యాన్ని వీడియోలో వివరించింది.