News15th Nov 03:28 PMSunil Byrisetty1 min read

ఆంధ్రా ఊటీ అరకులో పర్యాటకుల సందడి

ఆంధ్రా ఊటీ అరకులోయలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతోతెల్లవారుజామునే మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్కు టూరిస్టులు భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ మంచు వ

ఆంధ్రా ఊటీ అరకులో పర్యాటకుల సందడి
ఆంధ్రా ఊటీ అరకులోయలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతోతెల్లవారుజామునే మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్కు టూరిస్టులు భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ మంచు వాతావరణాన్ని ఆస్వాదించారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యాల్లో పాల్గొని సరదాగా గడిపారు. ఇటీవల వరుస తుఫానుల కారణంగా తగ్గిన పర్యాటకుల రాక ఒక్కసారిగా పెరగడంతో స్థానిక వ్యాపారులు, గిరిజనుల్లో ఆనందం నెలకొంది. అరకులో చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉండడంతో.. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంది. అరకు వెళ్తే చుట్టుపక్కల తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. చాపరాయి, బొర్రా గుహలు, లంబ సింగి, వనజంగి, కటిక వాటర్ పాల్స్ , చాక్లెట్ ఫ్యాక్టరీ, కాఫీ తోటలు, అరకు మ్యూజియం, గిరిజన గ్రామం సందర్శించవచ్చు. అరకు సందర్శనకు నవంబర్ నుంచి జనవరి, పిబ్రవరి వరకు మంచు, చలితో కూడిన వాతావరణం అద్భుతంగా ఉంటుంది.
Scroll for the next article