Politics27th Dec 02:59 PMSunil Byrisetty1 min read

ఏపీలో టీపీసీసీ రాజకీయం!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపగలిగేది ఒక్క రాహుల్ గాంధీనేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్

ఏపీలో టీపీసీసీ రాజకీయం!
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపగలిగేది ఒక్క రాహుల్ గాంధీనేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి ఈ ప్రకటన చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ వీరందరికీ కేంద్రంతో సంబంధాలు ఉన్నా, ఎంపీల బలం ఉన్నా స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు కాపాడలేకపోతున్నారని జగ్గారెడ్డి అడుగుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న నీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలని జగ్గారెడ్డి సూచించారు. ఏపీలో ఇలా మాట్లాడటానికి కారణం కూడా ఆయన చెప్పారు. విభజన సమయంలో ఏపీ విడిపోవద్దని చెప్పిన ఏకైక వ్యక్తిని తానేనని, కాబట్టి ఇక్కడ మాట్లాడే పూర్తి హక్కు తనకు ఉందన్నారు.
Andhra Pradesh Politics
TPCC
Jaggareddy
Telangana Congress
Rahul Gandhi
Vizag Steel Plant
Privatization
Congress Party
Vijayawada
Press Meet
Chandrababu Naidu
వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్
కేంద్ర ప్రభుత్వం
నీటి ప్రాజెక్టులు
Scroll for the next article