News28th Oct 05:33 PMSunil Byrisetty1 min read
విజయవాడలో సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడలో సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని పోలీసుల సూచించారు. నగరంలో భారీ వాహనాల ర
విజయవాడలో సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని పోలీసుల సూచించారు. నగరంలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. నగర పరిధిలో ఎక్కడ వాహనాలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారులు ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షల అమలు.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసుల సూచించారు. సాయంత్రం 7 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు రోడ్ల పైకి రాకుండా చూడాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.