News17th Jun 01:39 PMSunil Byrisetty1 min read

విశాఖ బీచ్‌ రోడ్‌‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

జూన్ 21న విశాఖలో జరిగే యోగాంధ్ర ఏర్పాట్లపై విశాఖపట్నంలోని VMRDA కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత, రోడ్లు, భవనాల శాఖ మంత్ర

విశాఖ బీచ్‌ రోడ్‌‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జూన్ 21న విశాఖలో జరిగే యోగాంధ్ర ఏర్పాట్లపై విశాఖపట్నంలోని VMRDA కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రులు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, NDA కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. నేటి నుంచి విశాఖ బీచ్‌ రోడ్‌‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. యోగా డే సందర్భంగా ఈ నెల 21న విశాఖకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు నేవల్ కోస్ట్ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు రెడ్‌ జోన్ విధించారు. ఈ నెల 21 వరకు ఆర్కే బీచ్ రోడ్డు మూసివేయడంతోపాటు, 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు ప్రకటించారు.
Andhra Pradesh news
Visakhapatnam
Pm Modi
Yoga andhra
Vizag beach road
Traffic restrictions
red zone
నేటి నుంచి విశాఖ బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు
అచ్చెన్నాయుడు
హోం మంత్రి అనిత
రోడ్లు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Scroll for the next article