International17th Nov 11:08 AMSunil Byrisetty1 min read

సౌదీలో బస్సు ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో 42 మంది మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భారతీయ యాత్రికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. బద

సౌదీలో బస్సు ప్రమాదం.. 42 మంది మృతి
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డీజిల్‌ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో 42 మంది మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భారతీయ యాత్రికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ ప్రాంతంలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి విదేశాంగ శాఖతో మాట్లాడి కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.
Indian Pilgrims
Saudi Arabia Accident
Bus Crash
Mecca To Medina
Hyderabad Residents
Telangana CM
Diesel Tanker Collision
Middle East News
India Abroad
Scroll for the next article