News27th Aug 04:41 PMSunil Byrisetty1 min read
కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైనీ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్ల మృతి చెందారు. గార్గ్ ఏవియేషన్‌కు చెందిన టెక్నామ్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైనీ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్ల మృతి చెందారు. గార్గ్ ఏవియేషన్‌కు చెందిన టెక్నామ్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. గంగా బ్యారేజీ సమీపంలోని నతాపుర్వా గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే విమానం నేలకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గుజరాత్‌కు చెందిన ఇన్‌స్ట్రక్టర్ సచిన్ భాటియా, కర్ణాటకకు చెందిన ట్రైనీ పైలట్ అభిషేక్ పూజారిగా గుర్తించారు. సచిన్‌కు 3 వేల గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. VT-NBV నంబర్ గల ఇదే విమానం జూన్‌లో కాన్పూర్ చకేరి ఎయిర్‌పోర్ట్‌లోనూ ప్రమాదానికి గురైందని తెలుస్తోంది.