News2nd Jan 03:12 PMSunil Byrisetty1 min read
భూ యాజమాన్య వ్యవస్థలో సరికొత్త మైలురాయి
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని, భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని, భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కంచికచెర్ల మండలం, పెండ్యాలలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో భూ యజమానులకు హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను ఈ-కేవైసీతో అందజేశారు. భూ రికార్డుల డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునికీకరణ డేటా ద్వారా భూ సంబంధిత వివాదాలకు చెక్‌పెట్టడంతో పాటు రైతులకు వేగవంతమైన సేవలు అందనున్నాయని వివరించారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా.. శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సమాచారం డేటా సెంటర్‌లో భద్రంగా ఉంటుందని.. ఈ డేటాతో రైతులు సత్వర సేవలు పొందేందుకు వీలుంటుందని వివరించారు