News26th Sep 05:34 PMSunil Byrisetty1 min read
పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా షాపుల కేటాయింపు జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఎక్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా షాపుల కేటాయింపు జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీని రూపొందించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి ఎక్సైజ్ విధానాలను పరిశీలించి అత్యుత్తమ పాలసీ రూపొందించామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని నాశనం చేశారని విమర్శించారు. మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. జేబులు నింపుకోవడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వ షాపుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆదాయం మాత్రమే కాకుండా.. పారదర్శకమైన విధానం, ప్రజల ఆరోగ్యంపై కూడా చిత్తశుద్ధి చాటుకుంటోందని వెల్లడించారు.