Politics25th Aug 04:46 PMSunil Byrisetty1 min read
సర్ నోటీసులపై పారదర్శకంగా విచారణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీచేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీచేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి, వారి వివరణను పూర్తిగా విని, అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. విజయవాడలో ఐఏఎస్ అధికారి, రోల్ అబ్జర్వర్ ఎంవీ శేషగిరిబాబు పర్యటించారు. సర్ నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను పరిశీలించారు. హియరింగ్ సమయంలో నోటీసులో పేర్కొన్న అంశాలపై వారి వివరణను పూర్తిగా వింటున్న తీరును పరిశీలించారు. ఓటర్లు సంబంధిత చిరునామాలో నివసిస్తున్నారా, రికార్డుల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా, అవసరమైన ఆధారాలు, పత్రాలు సమర్పిస్తున్నారా, అలాగే బీఎల్‌వోలు, అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్న విధానాన్ని సమీక్షించారు. ఇప్పటివరకు 1,90,348 నోటీసుల పంపిణీ జరగ్గా.. వీటిలో 75,471 మందికి విచారణ నిర్వహించడం జరిగింది. 58,895 మందికి విచారణ షెడ్యూలు గడువు ముగియగా విచారణ కోసం రీషెడ్యూల్ చేయడం జరుగుతోంది.