News27th Jun 12:43 PMSunil Byrisetty1 min read
జగన్ వాహనాన్ని తనిఖీ చేసిన రవాణా అధికారులు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. సిం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. సింగయ్య మృతిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్ నెస్ ఎలా ఉందో ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేశారు.