News22nd Jul 03:22 PMSunil Byrisetty1 min read
ట్రాన్స్పోర్ట్ వాహనదారుల జేఏసీ చలో విజయవాడ
ఏటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ఆర్ టి ఓ కార్యాలయం వద్ద నుండి భారీ కార్ ర్యా
ఏటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ఆర్ టి ఓ కార్యాలయం వద్ద నుండి భారీ కార్ ర్యాలీని జేఏసీ నాయకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఏటిఎస్ విధానం రద్దు చేసే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడతామని నాయకులు అన్నారు. ఈ విధానంతో గుడివాడలోని వేలాదిమంది వాహనదారులు వివరంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి గుడివాడలో గల 67406 రవాణా వాహనాలకు పాత పద్ధతుల్లో బ్రేకులు చెయ్యాలని విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజ్ఞప్తి చేసేందుకు వెళుతున్నట్లు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి శ్రీనివాస్, జేఏసీ నాయకులు, రవాణా వాహన యజమానులు పాల్గొన్నారు.