News22nd Mar 05:08 PMSunil Byrisetty1 min read
విజయవాడలో ట్రావెల్ ఎగ్జిబిషన్
పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన శనివారం సందర్శకుల తాకిడితో ప్రదర్శన నిండిపోయింది. పెద్ద సంఖ్యలో వ
పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది.
తొలిరోజైన శనివారం సందర్శకుల తాకిడితో ప్రదర్శన నిండిపోయింది. పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్శకులు, పర్యాటక ప్రియులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. దేశీయ పర్యాటక ప్యాకేజీలతోపాటు అంతర్జాతీయ టూర్లకు సంబంధించిన వివరాలను పలువురు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎగ్జిబిషన్(ఐఐటీఈ) డైరెక్టర్ అనురాగ్ గుప్తా మాట్లాడుతూ విజయవాడలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు తొలిరోజే ఊహించని స్పందన వచ్చిందని తెలిపారు.
ప్రదర్శనలో అత్యుత్తమ టూర్ ప్యాకేజీలు, దేశవిదేశీ పర్యటనల గురించి సందర్శకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.
విజయవాడ బందర్ రోడ్‌లోని రాఘవయ్య పార్క్ సమీపంలోని విజయ కృష్ణ సూపర్ బజార్‌పైన ఉన్న అమరావతి కన్వెన్షన్స్‌లో ఆదివారం కూడా 11.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.
భారతదేశంలో ప్రీమియర్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ ఇదని చెప్పారు.
ఐఐటీఈ అనేది ట్రావెల్, టూరిజం, రైల్వేలు, హాస్పిటాలిటీ, అనుబంధ పరిశ్రమల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రదర్శిస్తుందని వివరించారు.
ఈ ట్రావెల్ ఎగ్జిబిషన్ దేశీయ, అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానాలు, హోటళ్ళు, రిసార్ట్‌లు, అనుబంధ సేవలు, దేశ విదేశీ టూర్ ఆపరేటర్ల వివరాలు అందిస్తుందని తెలిపారు.