News26th Nov 05:45 PMSunil Byrisetty1 min read

సంక్రాంతికి ఊరెళ్లాలా.. టికెట్ రేట్ల షాక్

పండగల్లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ దారుణంగా మారుతోంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు బుక

సంక్రాంతికి ఊరెళ్లాలా.. టికెట్ రేట్ల షాక్
పండగల్లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ దారుణంగా మారుతోంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు బుక్ అయిపోయాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదనుగా ఛార్జీలను భారీగా పెంచేశారు. విమాన టికెట్ ధరలను మించి టికెట్ ధరలు ఉండటం ప్రయాణికులను బెంబేలు పెడుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లే బస్సుల టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర సుమారు రూ.1,880 ఉండగా, ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇదే ధర రూ.5,000 నుంచి రూ.6,999 వరకు పలుకుతోంది. ఆశ్చర్యకరంగా ఇదే మార్గంలో జనవరి 9న విమాన టికెట్ ధర సుమారు రూ.6,500 మాత్రమే ఉంది. అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది. పండగ రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Andhra Pradesh
Sankranti
Festival Travel
Bus Tickets
Private Travels
RTC Buses
Train Tickets
Flight Tickets
Ticket Prices
Passengers
రైలు టికెట్లు
విమాన టికెట్లు
టికెట్ ధరలు
ప్రయాణికులు
Scroll for the next article