News1st Nov 04:52 PMSunil Byrisetty1 min read

మా బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించండి

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని తమ బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి లోకేష్ కోరారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చేస్త

మా బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించండి
రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని తమ బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి లోకేష్ కోరారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతున్న పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు వెళ్లి పరామర్శించారు. ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న బాలికను చూసిన మంత్రి లోకేష్, అనంతరం బాలిక తల్లిదండ్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఘటన జరిగిన తీరును స్కూల్ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, తాను అన్ని విధాలా అండగా ఉంటామని బాలిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బాలికపై రాక్షస దాడికి పాల్పడిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
Scroll for the next article