News21st Jul 04:56 PMSunil Byrisetty1 min read

సీఎం దృష్టికి.. గిరిజనుల సమస్యలు

గిరిజనులకు సంబంధించిన జీఓ నం.3 పునరుద్ధరణకు సీఎం సానుకూలంగా ఉన్నారని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. 1/70 చట్టంతో పాటు గిరిజన సమస్యలపై సీఎంకు అవగాహన ఉందని తెలిపారు. జీవో

సీఎం దృష్టికి.. గిరిజనుల సమస్యలు
గిరిజనులకు సంబంధించిన జీఓ నం.3 పునరుద్ధరణకు సీఎం సానుకూలంగా ఉన్నారని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. 1/70 చట్టంతో పాటు గిరిజన సమస్యలపై సీఎంకు అవగాహన ఉందని తెలిపారు. జీవో నం.3 పునరుద్ధరణ కోసం న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల నాయకులతో పలుమార్లు చర్చించామని వివరించారు. ఐటీడీఏల పరిధిలో గిరిజన ప్రతినిధులు, సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించిందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజనులకు 50ఏళ్లకే పెన్షన్, విద్య, వైద్యం, ఐటీడీఏల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Sandhyarani
Chandrababu Naidu
GO No. 3
Tribal Welfare
ఐటీడీఏ
1/70 చట్టం
గిరిజన హక్కులు
కూటమి ప్రభుత్వం
Scroll for the next article