News31st Oct 04:15 PMSunil Byrisetty1 min read

ప్రజాదర్బార్ నిర్వహించిన గిరిజన మంత్రి

గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులోని క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకు

ప్రజాదర్బార్ నిర్వహించిన గిరిజన మంత్రి
గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులోని క్యాంపు కార్యాలయంలో “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తమ అర్జీలను సమర్పించగా, మంత్రి వినతులను శ్రద్ధగా స్వీకరించారు. సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ప్రతి ఒక్కరి సమస్య వేగంగా పరిష్కరించేందుకు అధికారులకు వెంటనే సూచనలు జారీ చేస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రివర్యులు స్పష్టం చేశారు.
Andhra Pradesh
Tribal Welfare
Women and Child Welfare
Gummidi Sandhya Rani
Praja Darbar
Saluru
సంక్షేమ పథకాలు
ప్రజా సేవ
అధికారుల సూచనలు
Scroll for the next article