News11th Aug 04:03 PMSunil Byrisetty1 min read

వంద పడకల ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సంధ్యారాణి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 బెడ్ల హాస్పిటల్‌ను సందర్శించి, నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.హాస్పిటల్ నిర్మాణ పనులు వే

వంద పడకల ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సంధ్యారాణి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 బెడ్ల హాస్పిటల్‌ను సందర్శించి, నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందించడంలో ఈ హాస్పిటల్ కీలక పాత్ర పోషించనుందని, కాబట్టి నాణ్యత, సదుపాయాలు, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. తదుపరి, మున్సిపల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమావేశమై, హాస్పిటల్ పరిసరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, డ్రైనేజ్ సౌకర్యాలు, నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ల వంటి అంశాలపై సూచనలు అందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్ సూచించారు.
Andhra Pradesh news
Salur
Tribal Welfare
Hospital Construction
Healthcare Development
Infrastructure
Public Health
Government Initiatives
హాస్పిటల్ నిర్మాణం
ఆరోగ్య సేవలు
Scroll for the next article