News17th Jan 03:46 PMSunil Byrisetty1 min read
పిన్న వయసులో జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి
తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ గిరిజన యువతి తొలిసారి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సివిల్ జడ్జిగా ఎంపికైన 23 ఏళ్ల శ్రీపతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. తన లక్ష్యాన
తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ గిరిజన యువతి తొలిసారి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సివిల్ జడ్జిగా ఎంపికైన 23 ఏళ్ల శ్రీపతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీపతి అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వైద్యులు ప్రమాదమని వారించినా ధైర్యం చేశారు. రెండు రోజుల పసికందుతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జ్ పరీక్ష రాసిన శ్రీపతి ఉద్యోగానికి ఎంపికై చరిత్ర సృష్టించారు. శ్రీపతి సాధించిన విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.