International18th Nov 03:16 PMSunil Byrisetty1 min read
సౌదీ ప్రమాద మృతులకు నివాళి
పవిత్ర మక్కా - మదీనా యాత్రకు వెళ్లిన యాత్రికులు మక్కా నుంచి మదీనా వెళ్లే దారిలో ఆయిల్ ట్యాంకర్ ఢీ కొని 45 మంది హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మైనార్టీ సోదరులు మరణించడం చాలా బ
పవిత్ర మక్కా - మదీనా యాత్రకు వెళ్లిన యాత్రికులు మక్కా నుంచి మదీనా వెళ్లే దారిలో ఆయిల్ ట్యాంకర్ ఢీ కొని 45 మంది హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మైనార్టీ సోదరులు మరణించడం చాలా బాధాకరమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో హజ్ కమిటీ ఛైర్మన్ హాజీ హసన్ బాషా ఆధ్వర్యంలో సౌదీ ప్రమాద మృతులకు నివాళులు అర్పించారు. ఈ దువా కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రభుత్వ సలహాదారు, మాజీ శాసన మండలి ఛైర్మన్ ఎండీ షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ముస్లిం మైనార్టీ నాయకులు మన్సూర్, మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్ రౌఫ్, అబ్దుల్ అజీమ్, షఫీ, ఫజుల్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... సౌదీ మృతులకు జన్నతుల్ ఫిర్దోస్ లో స్థానం కల్పించాలని ప్రార్థనలు చేశారు. జీవితంలో ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు తమ మతాచారం ప్రకారం మక్కా యాత్ర చేయాలనేది జీవితంలో ఒక కీలక ఘట్టమని వక్తలు పేర్కొన్నారు. అలాంటి ఉమ్రా యాత్రకు ఇంటిల్లిపాది వెళ్లి అల్లాను స్మరించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతి ముస్లిమ్స్ సౌదీ మృతులకు నివాళిగా దువా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గార్ల ఆదేశాలతో ఉమ్రా యాత్రికుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని... టీడీపీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించామని హజ్ కమిటీ ఛైర్మన్ హాజీ హసన్ బాషా పేర్కొన్నారు.