Entertainment29th Oct 05:45 PMSunil Byrisetty1 min read
ఆదర్శ కుటుంబంపై త్రివిక్రమ్ ఆశలు
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాత్రివిక్రమ్‌కు ఒక పరీక్ష లాంటిదే. ఎందుకంటే తన రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా బ్లాక్ కామెడీ జాన
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాత్రివిక్రమ్‌కు ఒక పరీక్ష లాంటిదే. ఎందుకంటే తన రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా బ్లాక్ కామెడీ జానర్‌లో ఆయన చేస్తున్న ప్రయత్నమిది. ఈ సినిమా వెంకటేష్‌తో త్రివిక్రమ్ చేస్తున్న ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాలతో వెంకటేష్‌లోని కామెడీ టైమింగ్‌ను రచయితగా ప్రేక్షకులకు అద్భుతంగా పరిచయం చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు తొలిసారి వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తూ, ఆయన నుంచి మరింత కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకురావాల్సిన బాధ్యత త్రివిక్రమ్‌పై ఉంది. వెంకటేష్‌ను ఎంత కొత్తగా చూపిస్తారు? ఆయనకు ఎలాంటి పాత్రను డిజైన్ చేశారు? ఈ కాంబినేషన్‌తో ప్రేక్షకులకు ఎలాంటి వినోదం ఇస్తారు? అన్నది కూడా కీలకం కానుంది.