International1st Aug 11:49 AMSunil Byrisetty1 min read

ట్రంప్‌ ఎఫెక్ట్.. 70 దేశాలపై సుంకాలు!

70 దేశాలపై సుంకాల మోత మోగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బాంబు పేల్చారు. నేటి నుంచి కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి. అయితే, కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా

ట్రంప్‌ ఎఫెక్ట్.. 70 దేశాలపై సుంకాలు!
70 దేశాలపై సుంకాల మోత మోగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బాంబు పేల్చారు. నేటి నుంచి కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి. అయితే, కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం, కెనడాపై 35 శాతం, భారత్‌పై 25 శాతం సుంకాలు ఉన్నాయి. బ్రెజిల్‌పై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచారు. ఆయా దేశాలపై టారిఫ్‌ల వివరాలు.. * సిరియా- 41 శాతం సుంకం.. * లావోస్‌- 40 శాతం సుంకం * మయన్మార్‌- 40 శాతం సుంకం * స్విట్జల్యాండ్‌- 39 శాతం సుంకం * ఇరాక్‌- 35 శాతం సుంకం * సెర్బియా-35 శాతం సుంకం * భారత్‌- 25 శాతం సుంకం * పాకిస్తాన్‌- 19 శాతం సుంకం * బంగ్లాదేశ్‌- 20శాతం సుంకం * శ్రీలంక- 20 శాతం సుంకం భారత్‌ మిత్రదేశమే అయినా.. టారీఫ్స్ ఎక్కువగా ఉండటంతో పాటు రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేయడంతోనే భారీగా సుంకాలను విధించినట్లు చెప్పుకొచ్చారు.
Trump tariffs 2025
US import duties
India US trade
Syria US sanctions
global trade war
US economic policy
Donald Trump news
high tariffs countries
గ్లోబల్ టారిఫ్‌లు
అమెరికా-భారత్ వాణిజ్యం
డొనాల్డ్ ట్రంప్
Scroll for the next article