International31st Jul 09:31 AMSunil Byrisetty1 min read

భారత్‌‌పై అమెరికా బాదుడే బాదుడు!

బాదుడే బాదుడు ఈ స్లోగన్ ఏపీలో ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల కోసం ఉపయోగించింది. ఎన్నికల తర్వాత అదే వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలకు వాడుతోంది. అయితే తాజ

భారత్‌‌పై అమెరికా బాదుడే బాదుడు!
బాదుడే బాదుడు ఈ స్లోగన్ ఏపీలో ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శల కోసం ఉపయోగించింది. ఎన్నికల తర్వాత అదే వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలకు వాడుతోంది. అయితే తాజాగా భారత్‌‌పై అమెరికా సుంకాల మోత మోగించింది. భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా సుంకలతో బాదుడే బాదుడుకు దిగింది. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. ఈ పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయని ట్రంప్ తెలిపారు. కానీ భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయంటూ ఆరోపిస్తూ సుంకాల బాదుడు ప్రకటించారు.
India-US relations
US tariffs on India
Donald Trump
Russia-India defense deals
Ukraine war impact
oil trade
international trade policy
August 2025 tariffs
WYS government
Scroll for the next article