News25th Jun 06:28 PMSunil Byrisetty1 min read

విశాఖపట్నం, విజయవాడలో తృప్తి క్యాంటీన్లు!

నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించిన తృప్తి క్యాంటీన్‌కు ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో నాలుగు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

విశాఖపట్నం, విజయవాడలో తృప్తి క్యాంటీన్లు!
నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించిన తృప్తి క్యాంటీన్‌కు ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో నాలుగు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల్లో తృప్తి క్యాంటీన్ ఒకటి. బ్యాంకుల నుంచి సంఘాలకు పెట్టుబడి నిధి కింద రుణాలు అందించి వాటితో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించాలన్నది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రణాళిక. విజయవాడలో 4 క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ విజయవాడలోని పంజా సెంటర్, షాదీఖానా సమీపంలోని తృప్తి క్యాంటీన్‌ను సందర్శించారు.
Andhra Pradesh news
Minister Narayana
trupti canteens
Vijayawada
visakhapatnam
4 canteens
మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్
తృప్తి క్యాంటీన్
Scroll for the next article