TTD9th Oct 03:50 PMSunil Byrisetty1 min read

ఆన్‌లైన్లో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్స

ఆన్‌లైన్లో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణ మండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.
TTD
Tirumala Tirupati Devasthanams
TTD 2026 Calendar
TTD Diaries
Tirupati News
Srivari Calendar
Padmavathi Ammavari Calendar
TTD Online Booking
Hindu
శ్రీవారి క్యాలెండర్
పద్మావతి అమ్మవారి క్యాలెండర్
Scroll for the next article